పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా టైసన్ నాయుడు.. టీజర్‌‌‌‌‌‌‌ రిలీజ్

పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా టైసన్ నాయుడు.. టీజర్‌‌‌‌‌‌‌ రిలీజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్  హీరోగా  సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్  బ్యానర్‌‌‌‌‌‌‌‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న చిత్రం ‘టైసన్ నాయుడు’. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, విడుదల సిద్ధంగా ఉంది. తాజాగా టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పెషల్ అపరేషన్స్ టీమ్‌‌‌‌లో పనిచేసే పవర్‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్నాడు. ఓల్డ్ సిటీ నేపథ్యంలో అల్లర్లు, అరెస్టులు, రెడ్ ట్యాగింగ్ వంటి అంశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది.

ముఖ్యంగా ‘నో అరెస్ట్.. నో రికార్డ్స్’ అనే డైలాగ్ హీరో పాత్రలోని రఫ్‌‌‌‌నెస్‌‌‌‌ను హైలైట్ చేస్తోంది.  ఒక డీల్ వెనుక దాగి ఉన్న కుట్ర, దాని చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్, రహస్యాలు కథపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. బెల్లంకొండ మాస్ లుక్, బాక్సింగ్ షాట్స్, యాక్షన్ సీన్స్‌‌‌‌కు భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌‌‌‌గ్రౌండ్  స్కోరు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా, రావు రమేష్, షాయాజీ షిండే   కీలక పాత్రల్లో కనిపించనున్నారు.