అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రాకా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న మేకర్స్.. తాజాగా సినిమాకు సంబంధించి కొన్ని టార్గెట్స్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
2027 మార్చి నాటికి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్‌గా ఓ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారట. మరోవైపు ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత కీలకం కావడంతో.. షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టాలని టీమ్ నిర్ణయించిందట.
ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో సినిమాను సిద్ధం చేయాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే 2027 క్రిస్మస్ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా ‘రాకా’ తెరకెక్కుతోంది.
మూడు విభిన్న కాలాల నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా.. జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
