నవంబర్ 27న ఊచకోతకు శర్వానంద్ సిద్ధం

నవంబర్ 27న ఊచకోతకు శర్వానంద్ సిద్ధం

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన పాన్-ఇండియా పీరియాడికల్  యాక్షన్ డ్రామా  ‘భోగి’.  తొలుత ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేయాలని భావించినప్పటికీ, అనివార్య కారణాలతో వాయిదా వేశారు. తాజాగా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 27న ‘గంగ’ ఉచకోతకు సిద్ధమవుతున్నాడు అని మేకర్స్ ఈ అప్‌‌డేట్ అందించారు.

ఇందులో  గంగా పాత్రలో శర్వానంద్ రఫ్ అండ్ రగ్డ్ లుక్‌‌తో కనిపించనున్నాడు.  అనుపమ పరమేశ్వరన్‌‌, డింపుల్ హయాతి హీరోయిన్స్‌‌గా నటించారు.  1960ల ప్రారంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దు నేపథ్యంలో ఈ కథ  సాగనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెం చాయి.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.