హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్ విలీనంపై విద్యాశాఖ తయారు చేసిన డ్రాఫ్ట్‌ను 10 రోజుల్లో పబ్లిక్లో పెడ్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ వెల్లడించారు. గురువారం ఆమె తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇంటర్ విలీన సందర్భంగా తీసుకునే అంశాలపై ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం చేయలేదని తెలిపారు. బయట జరిగేవన్నీ రూమర్స్ మాత్రమేనని, వాటిని ఎవరూ నమ్మొద్దన్నారు. డ్రాఫ్ట్‌పై టీచర్లు, లెక్చరర్లు, మేనేజ్మెంట్లు, స్టూడెంట్లతోపాటు యూనియన్లతో ప్రత్యేకంగా సమావేశమవుతామని చెప్పారు.
అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ప్రభుత్వం ఫైనల్ చేస్తుందన్నారు. విలీన ప్రక్రియ విషయంలో ఇంటర్ బోర్డు, ఇంటర్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగికీ అన్యాయం జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. మరోవైపు, స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్ విద్య విలీనమైతే.. ఇంటర్ సిలబస్‌లో గానీ, ఎగ్జామ్ ప్యాటర్న్‌లో గానీ ఎలాంటి మార్పులు ఉండవని తేల్చిచెప్పారు. ప్రస్తుత సిలబస్, పరీక్షల విధానం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
