పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక బ్రీడింగ్ పాలసీ.. మరో 20 లక్షల కృత్రిమ గర్భధారణ డోసుల సమీకరణ

పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక బ్రీడింగ్ పాలసీ.. మరో 20 లక్షల కృత్రిమ గర్భధారణ డోసుల సమీకరణ
  • టీజీఎల్‌‌‌‌డీఏ సమీక్షలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పశుసంపదను పెంచడంతో పాటు పశుపోషకుల ఆదాయం మెరుగుపరిచేందుకు ప్రత్యేక బ్రీడింగ్ పాలసీ రూపొందించాలని తెలంగాణ లైవ్‌‌‌‌స్టాక్ డెవలప్‌‌‌‌మెంట్ ఏజెన్సీ (టీజీఎల్‌‌‌‌డీఏ) నిర్ణయించింది. సంస్థ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

సీఈఓ డాక్టర్ సుబ్బారాయుడు, డిప్యూటీ డైరెక్టర్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా ప్రత్యేక బ్రీడింగ్ పాలసీ లేకపోవడాన్ని సమావేశం గుర్తించింది. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కొత్త విధానాన్ని వెంటనే రూపొందించాలని నిర్ణయించింది.

టీజీఎల్‌‌‌‌డీఏ కేంద్ర కార్యాలయంతో పాటు తొమ్మిది జిల్లాల డీఎల్‌‌‌‌డీఏ కార్యాలయాలు, కరీంనగర్, షాద్‌‌‌‌నగర్‌‌‌‌లోని ఫ్రోజెన్ సెమెన్ బుల్ స్టేషన్లను డిజిటలైజ్ చేసి పేపర్‌‌‌‌లెస్‌‌‌‌గా మార్చాలని తీర్మానించింది. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని విస్తరించాలని నిర్ణయించారు.

కంసన్‌‌‌‌పల్లి, షాద్‌‌‌‌నగర్ కేంద్రాలు త్వరలో అందుబాటులోకి రానుండటంతో అదనంగా 20 లక్షల డోసులు సమకూర్చాలని నిర్ణయించారు. పశుపోషణను గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరుగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేయాలని చైర్మన్ సూచించారు. పశుసంపద పెంపుతో రైతుల ఆదాయం పెంచడంతో పాటు సంస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.