మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రామ్ నితిన్ మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో కార్తిక్ జై పళని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడు వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. ఇప్పుడు ఓ అందమైన ప్రేమకథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ చిత్రంలో ప్రథానా నాథన్, తేజు అశ్విని హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోల్జర్స్ ఫ్యాక్టరీ, రెడాక్టెడ్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అనౌన్స్ చేస్తామని అన్నారు.
