తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు అనుబంధ ఆలయాల్లో ఆ దేవదేవుడికి కానుకలగా వచ్చిన, ఆయన ఉపయోగించిన వస్త్రాలు వేలం వేయనున్నారు. ఈ మేరకు వివరాలను టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 115 లాట్ల ఆర్ట్ సిల్క్ చీరలను నవంబర్ 23 నుండి 25వ తేదీ వరకు టీటీడీ వారు ఆన్లైన్లో EA ID Nos 28814 నుండి 28819 వరకు ఈ – వేలం వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్లో రిజిస్టర్ అయిన ఆసక్తి కల్గిన బిడ్డర్లు వస్త్రాల ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలములు) ఏఈవో ( వేలములు), టీటీడీ, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org లేదా 0877-2264429 / 9959988470 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు.
