- వడ్లు క్వింటాల్‌కు రూ. 3వేల969..
- బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో రికార్డు ధర
జడ్చర్ల, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి(జడ్చర్ల) వ్యవసాయ మార్కెట్లో బుధవారం వడ్లు రికార్డు ధర పలికాయి. ఆర్ఎన్ఆర్ రకం వడ్లకు గరిష్ఠంగా క్వింటాల్‌కు రూ. 3,969 రికార్డు ధర లభించగా, కనిష్ఠ ధర రూ. 2,209గా నమోదైంది. కాగా, బుధవారం ఒక్కరోజే మార్కెట్‌కు సుమారు 12,320 క్వింటాళ్ల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ఇతర ఉత్పత్తులు కూడా మంచి ధర పలికాయి. మొక్కజొన్న గరిష్ఠ ధర రూ. 3,182, కనిష్ఠ ధర రూ. 2,980, వేరుశనగ గరిష్ఠ ధర రూ. 9,141, కనిష్ఠ ధర రూ. 5,525, పత్తి గరిష్ఠంగా రూ. 9,219, కనిష్ఠంగా రూ. 8,789 పలికినట్లు మార్కెట్ కార్యదర్శి వెల్లడించారు.
