కండల కోసం ఇంజక్షన్లు వేసుకుంటే పిల్లలు పుట్టరు

కండల కోసం ఇంజక్షన్లు వేసుకుంటే పిల్లలు పుట్టరు
  • స్టెరాయిడ్లు, టెస్టోస్టెరాన్ సూదులతో సంతానోత్పత్తి సామర్థ్యానికి ముప్పు

హైదరాబాద్ సిటీ, వెలుగు: కండలు పెంచుకోవాలనే మోజులో అనాబాలిక్ స్టెరాయిడ్లు, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు తీసుకుంటే..శరీర సహజ హార్మోన్ల ఉత్పత్తిని అణచివేసి వీర్యకణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తాయని, దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు వీర్యకణాలు పూర్తిగా లేకుండా చేసే ప్రమాదం కూడా ఉందన్నారు.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఏషియన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సూరజ్ పిన్ని మాట్లాడుతూ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శ్రద్ధ చూపడం మంచిదే అయినా..డాక్టర్ల సూచన లేకుండా హార్మోన్లు, స్టెరాయిడ్లు వాడటం ముప్పేనన్నారు. పురుషుల ఆరోగ్యం అంటే కేవలం శరీర సౌష్టవం మాత్రమే కాదని, హార్మోన్ల సమతుల్యత, లైంగిక ఆరోగ్యం, సంతానోత్పత్తి సామర్థ్యం, మానసిక ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.