కరోనాను క్యాష్ చేసుకున్రు.. ఒక్కో బెడ్ కు లక్ష ..నిమ్స్‌‌‌‌‌‌‌‌లో నిధుల గోల్ మాల్

కరోనాను క్యాష్ చేసుకున్రు.. ఒక్కో బెడ్ కు లక్ష ..నిమ్స్‌‌‌‌‌‌‌‌లో నిధుల గోల్ మాల్
  • ఆరోగ్యశ్రీ పేషెంట్లనూ వదల్లేదు!
  • అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌ దాక వసూళ్లు
  • డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌ తర్వాత కూడా వారి పేరిటే నకిలీ బిల్లులు
  • ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూస్తున్న నిమ్స్‌‌‌‌‌‌‌‌ బాగోతం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిమ్స్‌‌‌‌‌‌‌‌ నిధుల గోల్‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌, టెండర్ల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారోనాను క్యాష్​ చేసుకొని ఒక్కో బెడ్​కు రూ. లక్ష వసూలు చేసినట్లు తెలిసింది. ఈ బెడ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ఈ మేరకు ఇప్పటికే నిమ్స్‌‌‌‌‌‌‌‌ మాజీ అడిషనల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌ నుంచి వివరాలు సేకరించారు.

 కరోనా సమయంలో లక్ష్మీ భాస్కర్‌‌‌‌‌‌‌‌ నోడల్‌‌‌‌‌‌‌‌ అధికారిగా విధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. కాగా, బెడ్‌‌‌‌‌‌‌‌ కేటాయింపు కోసం రూ.లక్ష వరకు వసూలు చేశారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే పంజాగుట్ట పీఎస్​లో నమోదైన ఓ కేసును పరిశీలించారు. ఈ కేసులో ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ అనే మధ్యవర్తి ద్వారా బెడ్స్ కేటాయించడంతో పాటు కేసును లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌లో కాంప్రమైజ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో లక్ష్మీ భాస్కర్‌‌‌‌‌‌‌‌ సహా నిమ్స్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ప్రమేయం గురించి ఆరా తీస్తున్నారు.

‘ఆరోగ్య శ్రీ’లోనూ.. 

ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వదలకుండా లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌ అండ్ కో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. ఆరోగ్యశ్రీ కింద జరిగిన సర్జరీలకు సంబంధించి పేషెంట్లు డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌ అయిన తర్వాత కూడా మందులు, సర్జరీ పరికరాల వినియోగించినట్లు బిల్లులు తయారు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. సర్జికల్ స్టోర్‌‌‌‌‌‌‌‌కు సప్లయ్‌‌‌‌‌‌‌‌ అయిన మందులు, పరికరాలు థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినియోగించినట్లు రాసిన రికార్డుల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఈ మేరకు గత రెండేండ్లుగా ఆరోగ్యశ్రీ కింద జరిగిన ఆపరేషన్లకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తోంది. 

ఆరోగ్యశ్రీ పేషెంట్ల పేరిట నకిలీ బిల్లులు!

ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగుల నుంచి అదనపు బిల్లులు వసూలు చేశారనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. నిమ్స్‌‌‌‌‌‌‌‌కు వచ్చే పేషెంట్లు దాదాపు 80 శాతం మందికి ఆరోగ్యశ్రీ పథకం కిందనే సర్జరీలు అవుతున్నట్లు విచారణలో వెలుగు చూసింది. ఈ క్రమంలోనే సర్జరీ కోసం వచ్చిన పేషంట్లు అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ దగ్గర్నుంచి సర్జరీ పూర్తి అయ్యేంత వరకు నిమ్స్ సిబ్బంది చేతి వాటం ప్రదర్శించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో లేని పేషంట్లకు మందులు, వైద్య పరికరాల సరఫరా చేసినట్లుగా రూపొందించిన బిల్స్‌‌‌‌‌‌‌‌ వ్యవహారంలో సప్లయర్ల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ మేరకు స్టోర్ రికార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కింద జరిగిన ఆపరేషన్ల వివరాలు సేకరిస్తున్నారు. 

ఆ రెండు సంస్థలకే టెండర్లు ఎందుకు..!

నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యాంటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులు, హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెక్యూరిటీ తదితర సేవలకు సంబంధించి టెండర్ల ప్రక్రియలో లక్ష్మీ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్రపై ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. క్యాంటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెండర్లలో ప్రిజం, నక్షత్ర సంస్థలు పాల్గొన్నాయని, ప్రస్తుతం నక్షత్ర సంస్థ నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యాంటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నట్లు ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది. 2026 టెండర్ల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీ కమిటీలోనూ లక్ష్మీ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్రపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 

మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపుల టెండర్లు, మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెండర్ల గురించి సమాచారం రాబడుతున్నారు. మరోవైపు ఆస్తుల కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆరోగ్యశాఖ నుంచి లక్ష్మీ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసినట్లు తెలిసింది.