అయిజ, వెలుగు: ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ నిరుపేద యువకుడి కుటుంబం వైద్య ఖర్చుల కోసం దాతలను వేడుకుంటోంది. గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన సురేశ్ పంక్చర్ షాప్ నిర్వహిస్తూ భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో జీవనం సాగిస్తున్నాడు.
ఆయన కుమారుడు అభిషేక్ ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడంతో తండ్రికి చేదోడువాదోడుగా షాప్ వద్దే పనిచేస్తున్నాడు. సోమవారం పంక్చర్ కోసం వచ్చిన ట్రాక్టర్ను అభిషేక్ స్టార్ట్ చేయగా అది అదుపుతప్పి అతడిపై నుంచే దూసుకెళ్లడంతో ముఖం, శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యం కోసం రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. పంక్చర్ దుకాణంతో కాలం వెళ్లదీసే ఆ నిరుపేద కుటుంబానికి అంత మొత్తం సమకూర్చే స్థోమత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మానవతావాదుల సహాయం కోరుతున్నారు. ఆర్థిక సహాయం అందించదలుచుకున్నవారు 9963931397 నెంబర్ను సంప్రదించాలని తండ్రి సురేశ్విజ్ఞప్తి చేశారు.
