గ్రామీ నామినేషన్లలో ధురంధర్‌‌ 2‌‌కు షాక్

గ్రామీ నామినేషన్లలో ధురంధర్‌‌ 2‌‌కు షాక్

బాక్సాఫీస్‌‌ దగ్గర సంచలనాలు సృష్టించిన ‘ధురంధర్‌‌: ది రివెంజ్‌‌’కు మరో విషయంలో మాత్రం నిరాశ ఎదురైంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా సంగీతం అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతుందని ఆశించిన అభిమానులకు షాక్‌‌ తగిలింది. 2027 గ్రామీ అవార్డుల కోసం ఏకంగా ఎనిమిది ఎంట్రీలను పరిశీలనకు పంపించినప్పటికీ.. ఒక్క పాట కూడా తుది నామినేషన్లలో చోటు సంపాదించుకోలేకపోయింది.  శాశ్వత్‌‌ సచ్‌‌దేవ్‌‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఇందులోని పాటలను వివిధ విభాగాల్లో  గ్రామీ పరిశీలనకు పంపించారు. అయినా తుది జాబితాలో ఈ ఆల్బమ్‌‌కు చోటు దక్కలేదు.   

తమిళ పాటకు చోటు
ఇదే గ్రామీ వేదికపై భారతీయ సంగీతానికి మరో రూపంలో గుర్తింపు లభించడం విశేషం. ‘వరువాయ్‌‌’ అనే తమిళ ఇండిపెండెంట్ సాంగ్ బెస్ట్‌‌ గ్లోబల్‌‌ మ్యూజిక్‌‌ పెర్ఫార్మెన్స్‌‌ విభాగంలో నామినేషన్‌‌ దక్కించుకుంది.  త‌‌మిళ దిగ్గజ ర‌‌చ‌‌యిత భార‌‌తియార్ శ్రీకృష్ణుడిపై రాసిన ఈ భ‌‌క్తి గీతాన్ని వెస్ట్రన్‌‌ స్టైల్‌‌లో దేవ‌‌న్ ఏకాంబ‌‌రం కంపోజ్ చేశారు.

నియో-జాజ్, కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని సుభిక్ష రంగరాజన్ (సుష) పాడారు. గ్రామీ చరిత్రలో ఓ తమిళ పాట ఈ విభాగంలో నామినేట్‌‌ కావడం ఇదే తొలిసారి.  ఇక ఈసారి గ్రామీ నామినేషన్లలో బ్రిటిష్‌‌ గాయని రే   హవా కొనసాగుతోంది. ఏకంగా 11 నామినేషన్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. దీంతో 69వ గ్రామీ అవార్డులపై సంగీత ప్రపంచంలో ఆసక్తి మరింత పెరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న లాస్‌‌ ఏంజిల్స్‌‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.