ప్రేమ, ఆకర్షణ మధ్య వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్ ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’

ప్రేమ, ఆకర్షణ మధ్య వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్ ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’

వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ  చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’.   ప్రేమ, పెళ్లి, వ్యామోహం, కోరికల చుట్టూ సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మంగళవారం  టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. వైవాహిక బంధంలో కోరికలు హద్దులు దాటితే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఎంత దూరం నెట్టగలరు?  అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో సాగిన టీజర్ ఆకట్టుకుంది.  ప్రేమలోని మరో కోణాన్ని, దాంపత్య జీవితంలోని ఇబ్బందులను ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

నిత్యా మీనన్, వివేక్ ఒబెరాయ్  భార్యాభర్తలుగా నటించిన  ఈ చిత్రంలో శ్రేయ శర్మ, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా ప్రేమ, ఆకర్షణ, వ్యామోహం వంటి భావోద్వేగాల మధ్య సాగే కథలో పాత్రల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా చూపించిన టీజర్  సినిమాపై అంచనాలను పెంచుతోంది.  వేవ్‌‌‌‌బ్యాండ్ ప్రొడక్షన్ బ్యానర్‌‌‌‌పై ఏ. ఝున్‌‌‌‌ఝున్‌‌‌‌వాలా, శిఖా కరణ్ అహ్లువాలియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంకుర్ పజ్నీ, విశాల్ రంజన్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు.   డిసెంబర్ 11న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా  సినిమా విడుదల  కానుంది.