తిమ్మాపూర్, వెలుగు: ‘జ్యోతిష్మతి’లో పెర్ల్ జూబ్లీ వేడుకలు స్టార్ట్ అయ్యాయి. మంగళవారం కరీంనగర్జిల్లా తిమ్మాపూర్‌లోని కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పెర్ల్ జూబ్లీ లోగోతో పాటు, ఏడాది పొడవునా నిర్వహించనున్న వేడుకలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సుమిత్ సాయి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏండ్ల విద్యా ప్రస్తానానికి నిదర్శనంగా తమ కళాశాలలో పెర్ల్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘గత వైభవాన్ని వేడుకగా జరుపుకుంటూ.. ఉజ్వల భవిష్యత్‌కు స్ఫూర్తినిద్దాం’ అనే నినాదంతో వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ అండ్ ఆడిట్ డాక్టర్ పీకే వైశాలి, ఆయా విభాగాల అధిపతులు, లెక్చరర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
