ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం ‘ఓం’. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై శ్రద్దా అగర్వాల్ నిర్మించారు. నవంబర్ 20న పాన్ ఇండియావైడ్‌గా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మమ్ముట్టి మాట్లాడుతూ ‘నా మలయాళ సినిమాలను తెలుగులో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. దీనికోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’ అని అన్నారు. ధనుష్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో చాలా పాత్రలు తెలుగులోనే మాట్లాడతాయి.
తిరుపతి, తిరుమల, తిరువణ్ణామలై వంటి రెండు పుణ్యక్షేత్రాల నేపథ్యంలో సాగే ఈ కథలో తెరపై కనిపించే అంశాల కంటే చాలా లోతైన భావాలు దాగి ఉన్నాయి. సినిమాలో నటించిన నటీనటులందరూ అద్భుతంగా నటించారు.
ఇలాంటి కాస్టింగ్ కుదరడం నిజంగా గొప్ప విషయం. తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను సెలెబ్రేట్ చేస్తుంటారు. అలాగే ‘ఓం’ కూడా అందరూ సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో తాను ఫస్ట్ టైమ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నానని సాయి పల్లవి చెప్పింది. తన కెరీర్‌లో ఇలాంటి సినిమా చేయడం చాలా ముఖ్యమని శ్రీలీల చెప్పింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉందని రేణు దేశాయ్ అన్నారు. ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని నిర్మాతలు శ్రద్దా అగర్వాల్, నాగవంశీ అన్నారు.
