మనసుకు నచ్చిన ప్రియుడితో హీరోయిన్ మృణాళిని రవి ఏడడుగులు

మనసుకు నచ్చిన ప్రియుడితో హీరోయిన్ మృణాళిని రవి ఏడడుగులు

పలు తెలుగు, తమిళ చిత్రాలతో హీరోయిన్‌‌గా ఆకట్టుకున్న మృణాళిని రవి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, ఆధ్యాత్మిక వక్త మహావిష్ణును ఆమె వివాహం చేసుకుంది. నవంబర్ 15న మలేషియాలోని లంకావి ద్వీపంలో వీరి వివాహ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగగా, తాజాగా ఆ ఫొటోస్‌‌ను మృణాళిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏడేళ్ల క్రితం మహావిష్ణుతో స్నేహంగా మొదలైన పరిచయం ప్రేమగా మారి ఈ ఏడాది ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది.

తమిళ చిత్రం ‘సూపర్‌‌‌‌ డీలక్స్‌‌’తో నటిగా పరిచయమైన ఆమె ఛాంపియన్‌‌, ఎనిమీ, కోబ్రా,  రోమియో లాంటి తమిళ చిత్రాల్లో నటించింది.  ఇక  ‘గద్దలకొండ గణేష్‌‌’తో టాలీవుడ్‌‌ ఎంట్రీ ఇచ్చి తెలుగులో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామా మశ్చీంద్ర చిత్రాల్లో నటించింది. ఇక పదహారేళ్ల వయసుకే టీవీ రియాలిటీ షోతో ఉత్తమ కమెడియన్‌‌గా మెప్పించిన మహావిష్ణు కె.. ఆ తర్వాత ఈవెంట్ మేనేజ్‌‌మెంట్ కంపెనీ సహా పలు బిజినెస్‌‌లు చేశాడు. ఇక 2021లో పరంపర్పొళ్ ఫౌండేషన్‌‌ను స్థాపించి ఆత్మశోధన, కర్మ, సంబంధాలు లాంటి అంశాలపై పెయిడ్‌‌ స్పిరిట్యువల్‌‌ క్లాసెస్‌‌ నిర్వహిస్తున్నాడు.