బెంగళూరు: ఐపీఎల్ (IPL) 2027 సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాను అధికారికంగా రిలీజ్ చేసింది. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకున్న ఆర్సీబీ.. వచ్చే సీజన్ కోసం జట్టులో పలు కీలక మార్పులు చేసింది. ఇంగ్లాండ్ యువ సంచలనం జేకబ్ బెతెల్ (Jacob Bethell) మోకాలి గాయం కారణంగా శస్త్రచికిత్సకు గురై సౌతాఫ్రికా టూర్‌తో పాటు ఐపీఎల్ 2027 సీజన్‌కు కూడా పూర్తిగా దూరమవ్వడంతో, ఫ్రాంచైజీ అతడిని విడుదల చేయక తప్పలేదు. బెతెల్‌తో పాటు మంగేష్ యాదవ్, రిచర్డ్ గ్లీసన్, విహాన్ మల్హోత్రా, సాత్విక్ దేశ్వాల్, స్వప్నిల్ సింగ్ సహా మొత్తం 6 మంది ప్లేయర్స్ ని ఆర్సీబీ వదిలేసింది.
విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, ఫిలిప్ సాల్ట్ రిటైన్:
* గాయపడిన జేకబ్ బెతెల్‌ను మినహాయిస్తే, తమ ఛాంపియన్ కోర్ గ్రూప్‌ను ఆర్సీబీ భద్రపరుచుకుంది.
* స్టార్ల కొనసాగింపు: విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, దేవ్‌దత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్‌లతో కూడిన పటిష్టమైన జట్టును ఫ్రాంచైజీ అట్టిపెట్టుకుంది.
వేలంలోకి రూ.14.15 కోట్ల పర్స్‌తో ఆర్సీబీ:
* బడ్జెట్, స్లాట్లు: డిసెంబర్ 16న గోవాలో జరిగే ఐపీఎల్ 2027 మినీ వేలంలో ఆర్సీబీ వద్ద రూ.14.15 కోట్లు అందుబాటులో ఉన్నాయి.
* వేలంలో ఆర్సీబీ గరిష్టంగా 5 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉండగా, ఇందులో కేవలం 1 విదేశీ ఆటగాడి (Overseas) స్లాట్ మాత్రమే ఖాళీగా ఉంది.
రిటైన్డ్ ప్లేయర్స్: అభినందన్ సింగ్, కనిష్క్ చౌహాన్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, నువాన్ తుషార, వెంకటేశ్ అయ్యర్, జాకబ్ డఫీ, ఫిల్ సాల్ట్, విక్కీ ఓస్త్వాల్, జితేశ్ శర్మ, రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, జోర్డాన్ కాక్స్, రసిఖ్ దార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, రొమారియో షెపర్డ్.
వదిలి పెట్టిన ఆటగాళ్లు: జాకబ్ బెథెల్, మంగేశ్ యాదవ్, రిచర్డ్ గ్లీసన్, విహాన్ మల్హోత్రా, సాత్విక్ దేశ్వాల్, స్వప్నిల్ సింగ్.
𝐏𝐫𝐞𝐬𝐞𝐧𝐭𝐢𝐧𝐠 𝐭𝐨 𝐲𝐨𝐮, 𝐭𝐡𝐞 𝐫𝐞𝐭𝐚𝐢𝐧𝐞𝐝 𝐩𝐥𝐚𝐲𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐑𝐂𝐁’𝐬 𝐂𝐥𝐚𝐬𝐬 𝐨𝐟 2️⃣0️⃣2️⃣7️⃣. ❤️ Ready to #PlayBold, fly the RCB flag high and create history again. 🔥 #ನಮ್ಮRCB https://t.co/4nu19130oV
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 17, 2026
