సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా.. విడుదలకు ముందే బిజినెస్ పరంగా సరికొత్త సంచలనాలకు తెరలేపుతోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల డీల్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ బిజినెస్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు, భారీ మొత్తాలతో ఆఫర్లు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ‘వారణాసి’ థియేట్రికల్, ఓటీటీ బిజినెస్ లెక్కలపై టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
వారణాసి బిజినెస్‌లో ఆల్‌టైమ్ రికార్డ్..
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజ్‌తో సినిమా బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను మైత్రీ మూవీస్ రూ.285 కోట్లకు దక్కించుకున్నట్లు సినీ వర్గాల టాక్. మొత్తం రూ.300 కోట్ల డీల్‌లో రూ.15 కోట్లు రికవరబుల్ అమౌంట్. నికర డీల్ విలువ రూ.285 కోట్లు అని సమాచారం. ఇప్పటికీ అడ్వాన్స్ చెల్లింపు పూర్తి, డీల్ క్లోజ్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘RRR’ తెలుగు బిజినెస్‌ను మించిన ఈ డీల్‌తో ‘వారణాసి’ విడుదలకు ముందే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ సినిమా హక్కుల కోసం మిగతా టాప్ తెలుగు నిర్మాణ సంస్థలు కూడా పోటీపడినప్పటికీ, చివరికి మైత్రి మేకర్స్ దక్కించుకున్నట్లు సినీ సర్కిల్ లో వినిపిస్తుంది. మరి ఇంతటి భారీ ధరకు మైత్రి.. థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేయడంతో బాక్సాఫీస్ వద్ద వారణాసి ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
‘వారణాసి’ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్..
థియేట్రికల్ బిజినెస్‌లో రికార్డులు సృష్టిస్తున్న ‘వారణాసి’ ఓటీటీ హక్కులపై కూడా భారీ ఆసక్తి నెలకొంది. నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం సుమారు రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జియోహాట్‌స్టార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఏ ఓటీటీ సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుందనే దానిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు అన్ని భాషల డిజిటల్ హక్కులు, మేకింగ్ కంటెంట్ వంటి ప్యాకేజీలతో కలిపి రూ.400 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు డీల్స్‌పై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్ సుమారు రూ.1,400 కోట్ల వరకు ఉంటుందనే అంచనాల నేపథ్యంలో వచ్చిన ఓటీటీ ఆఫర్లపై నిర్మాతలు సంతృప్తిగా లేరని, మరింత మెరుగైన డీల్ కోసం ఎదురుచూస్తున్నట్లు టాక్ . ప్రస్తుతం ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. విడుదల తేదీకి ముందే డిజిటల్ డీల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ఓటీటీ హక్కులను ఏ సంస్థ దక్కించుకుంటుందో, నిర్మాతలు ఎంతటి భారీ ధరకు ఒప్పందం కుదుర్చుకుంటారో చూడాలి.
‘వారణాసి’ కథేంటి? స్టోరీ బ్యాక్‌డ్రాప్ ఇదే!
‘వారణాసి’ కథపై మొదటి నుంచీ భారీ ఆసక్తి నెలకొంది. గ్లింప్స్‌ను బట్టి చూస్తే.. టైమ్ ట్రావెల్, పురాణాలు, సైన్స్ ఫిక్షన్, గ్లోబల్ అడ్వెంచర్ అంశాల కలయికతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మహేష్ బాబు రుద్రగా కనిపించనున్నారు. పురాతన కాస్మిక్ ఆర్టిఫాక్ట్ కోసం కాలాన్ని దాటి సాగే ఆయన ప్రయాణమే కథలో ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. వారణాసి నుంచి ఆఫ్రికా, అంటార్కిటికా వరకు సాగే ఈ సాహస ప్రయాణంలో ఎన్నో రహస్యాలు, ఊహించని మలుపులు ఎదురుకానున్నాయి. రామాయణ నేపథ్యానికి సంబంధించిన విజువల్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
రామాయణ కాలంలోకి మహేష్ బాబు!
‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ కీలక పాత్ర పోషించనుందని ప్రచారం జరుగుతోంది. రామాయణ కాలానికి, ప్రస్తుత కాలానికి మధ్య రాజమౌళి ఆసక్తికరమైన లింక్‌ను సృష్టించినట్లు టాక్. పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభ పాత్ర.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఉంటుందని, రావణుడి నవరత్న మాలను తిరిగి దక్కించుకోవడమే అతడి లక్ష్యమని సమాచారం. ఆ తొమ్మిది రత్నాలను వెతికే బాధ్యతను మహేష్ బాబు (రుద్ర)కు అప్పగిస్తాడట. ఈ క్రమంలో హీరో వార్మ్‌హోల్ ద్వారా రామాయణ కాలంలోకి ప్రయాణించి, రామ-రావణ యుద్ధానికి సంబంధించిన కీలక పరిణామాలను మార్చే ప్రయత్నం చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ ఆసక్తికరమైన స్టోరీ లైన్ ప్రస్తుతం అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది.
రాజమౌళి విజన్.. గ్లోబల్ స్థాయిలో మరో ప్రయోగం!
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. ఇప్పుడు ‘వారణాసి’తో మరో భారీ ప్రయోగానికి సిద్ధమయ్యారు. పురాణాలు, టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఐమ్యాక్స్ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వారణాసి, ఆఫ్రికా, అంటార్కిటికా వంటి విభిన్న లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు పాత్రల భావోద్వేగాలు, కథలోని ఉత్కంఠకు రాజమౌళి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ‘వారణాసి’ మరో విజువల్ వండర్‌గా నిలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.]
