బంగారం మెరుపు వేరే ఏ మెటల్స్ కి ఉండదు. ఎవరెన్ని చెప్పినా ఇది మాత్రం వాస్తవం. అందుకే దానికి అంత క్రేజ్ ! కానీ, రోజూ బంగారు నగలు వేసుకోవడం వల్ల వాటికి మురికి పడుతుంది. బంగారం మెరుపును మురికి మింగేస్తుంది. గోల్డ్ జువెలరీ ఎక్కువ రోజులు మెరవాలంటే రెగ్యులర్ గా క్లీన్ చేయాలి. అందుకే కాస్ట్లీ మెటల్ క్లీనింగ్ కోసం కొన్ని సేఫ్టీ టిప్స్..
రాళ్లు పొదగని వాటి కోసం...
గోరు వెచ్చని నీళ్లు ఒక గిన్నెలో తీసుకోవాలి. దాంట్లో లిక్విడ్ సోప్ లేదా మైల్డ్ డిష్‌వాషింగ్ లిక్విడ్ డ్రాప్స్ వేయాలి. తర్వాత అందులో బంగారు నగలని వేసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తర్వాత శుభ్రమైన మెత్తటి క్లాత్‌తో తుడవాలి. అదయ్యాక పొడిగా ఉన్న టవల్లో పెట్టి ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల నగల మీద పేరుకుపోయిన ఆయిల్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ పార్టికల్స్ పోతాయి.
►ALSO READ | కార్తీకమాసం: అక్షయనవమి( నవంబర్18) ... ఉసిరి చెట్టుకు లక్ష్మీదేవి పూజ.. ఐశ్వర్యం రెట్టింపు..!
రాళ్ల నగలకి...
విలువైన రాళ్లు పొదిగిన నగల్ని నీళ్లలో నానబెట్టకూడదు. నీళ్లలో వేయడం వల్ల రాయి వదులవుతుంది, ఊడిపోతుంది. శుభ్రం చేసేటప్పుడు నగలకి ఉన్న రాళ్లు నీళ్లలో మునగనివ్వొద్దు. బంగారు నగల వరకు మాత్రమే నానబెట్టి వాటిని క్లీన్ చేయాలి. రాళ్ల చుట్టూ మాత్రం శుభ్రమైన, మెత్తటి క్లాత్‌తో తుడవాలి.
డీప్ క్లీన్
కొన్ని నగలు ఎక్కువ డిజైన్లతో ఉంటాయి. అలాంటి వాటిని శుభ్రం చేయడం కాస్త కష్టం. ఇలాంటప్పుడు సాఫ్ట్ టూత్ బ్రష్ ని నీళ్లలో ముంచి క్లీన్ చేస్తే నగల మూలలు కూడా శుభ్రం అవుతాయి.
