టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఓ ఇంటివాడు కాబోతున్నారు. వరుస విజయాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ 'హనుమాన్' హీరో.. త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ రోజు ( నవంబర్ 16, 2026 ) తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. దీంతో టాలీవుడ్‌లో ఈ యంగ్ హీరో ఎంగేజ్‌మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ వేదికగా ఈ వేడుక ప్రత్యేకంగా నిర్వహించారు. అత్యంత ప్రైవేట్‌గా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహిత బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే అతిథుల జాబితా మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేశారు.
Hon’ble Union Minister @kishanreddybjp garu graced the #TejaSajjaEngagement with his presence. ❤️ Super Hero @tejasajja123 https://t.co/eEtYWyW0VW
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 16, 2026
ఇక సినీ ఇండస్ట్రీ నుంచి దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటి వరలక్ష్మీ శరత్ కుమార్, హీరో రానా దగ్గుబాటి, నటుడు శివాజీ, రావు రమేష్, నిర్మాతలు సాహు గారపాటి, టీజీ విశ్వప్రసాద్, దర్శకుడు కార్తీక్ గట్టమనేని, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తదితరులు సందడి చేశారు. ప్రముఖుల రాకతో తాజ్ కృష్ణ ప్రాంగణం సినీ సందడితో కళకళలాడింది. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
The macho @RanaDaggubati along with versatile actor #RaoRamesh garu arrive at the #TejaSajjaEngagement. ❤️ Super Hero @tejasajja123 https://t.co/TkwIxR2LnJ
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 16, 2026
సినిమాలతోనే కాదు.. ఇప్పుడు జీవితంలోనూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన తేజ సజ్జాకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెరపై సూపర్ హీరోగా అలరించిన తేజ.. నిజ జీవితంలోనూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతుండటంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. అయితే కాబోయే వధువు అమెరికాలో పెరిగింది. తన తండ్రితో కలిసి ఐటీకి సంబంధించిన వ్యా్పారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె పూర్తి వివరాలు, వివాహ తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..
The lovely pair @varusarath5 and #NicholaiSachdev make a grand arrival at the #TejaSajjaEngagement. ❤️ Super Hero @tejasajja123 https://t.co/qSRkkDkeyY
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 16, 2026
