VijayRashmika: రష్మికే నా ప్రపంచం.. ‘Mine’, ‘Home’, ‘Love’.. జపాన్ వెకేషన్‌లో విజయ్ దేవరకొండ స్పెషల్ పోస్ట్!

VijayRashmika: రష్మికే నా ప్రపంచం.. ‘Mine’, ‘Home’, ‘Love’.. జపాన్ వెకేషన్‌లో విజయ్ దేవరకొండ స్పెషల్ పోస్ట్!

సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వచ్చినా.. తమ వ్యక్తిగత జీవితాన్ని తమదైన శైలిలో ఆస్వాదిస్తున్నారు టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్న ఈ జంట.. ప్రస్తుతం జపాన్‌లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా విజయ్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రష్మికను దగ్గరకు తీసుకుని ‘Mine’, ‘Home’, ‘Love’ అంటూ ఇచ్చిన క్యాప్షన్లు దేవరకొండ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఈ ఫోటోల్లో ఏముంది? కరణ్ జోహార్ షో తర్వాత ఈ జంటపై జరిగిన ట్రోలింగ్ ఏంటి? జపాన్ వెకేషన్ ఎలా జరుగుతుంది అనేది ఓ లుక్కేద్దాం..

జపాన్‌లో ‘విరోష్’ ఫ్యామిలీ వెకేషన్..

టాలీవుడ్‌లో అభిమానులు ముద్దుగా ‘విరోష్’ (ViRosh) అని పిలుచుకునే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట ప్రస్తుతం జపాన్‌లో ఫ్యామిలీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. వరుస సినిమాలు, షూటింగులు, ప్రమోషన్లతో బిజీగా ఉండే ఈ స్టార్ కపుల్.. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతోంది. ఈ ట్రిప్‌కు సంబంధించిన అందమైన ఫోటోలను విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ దేవరకొండ, రష్మికతో కలిసి దిగిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ఈ ఫోటోలకు విజయ్ ఇచ్చిన క్యాప్షన్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. “Celebrating Life with my favourite people” అంటూ.. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తులతో జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చారు. మొత్తానికి సినిమా సందడి పక్కనపెట్టి.. ఫ్యామిలీతో ఫుల్ హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు విజయ్!

‘Mine’, ‘Home’, ‘Love’: రష్మిక కోసం విజయ్ స్పెషల్ క్యాప్షన్లు!

జపాన్ వెకేషన్‌లో విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోల్లో హైలైట్ మాత్రం రష్మికతో ఉన్న రొమాంటిక్ మూమెంట్సే! ఓ ఫొటోలో రష్మికను దగ్గరకు తీసుకుని ‘Mine’ అంటూ తనదైన స్టైల్‌లో ప్రేమను వ్యక్తం చేశారు. మరో ఫొటోలో ఆమె భుజంపై తలవాల్చి ‘Home’ అంటూ క్యూట్ క్యాప్షన్ ఇచ్చారు. ఇంకో ఫొటోలో వెనుక నుంచి హత్తుకుంటూ ‘Love’ అని రాసుకొచ్చారు. ఇంకేముంది.. ఈ మూడు పదాలే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ‘నువ్వే నా ఇల్లు’ అనే అర్థం వచ్చేలా ఉన్న ‘Home’ క్యాప్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. 

కరణ్ జోహార్ షోలో విజయ్ కామెంట్స్.. మొదలైన ట్రోలింగ్!

పెళ్లి తర్వాత తొలిసారి ‘కాఫీ విత్ కరణ్’ షోలో సందడి చేసిన విజయ్, రష్మిక తమ ప్రేమ, పెళ్లి విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లికి అంగీకరించే ముందు ఏడాది పాటు రష్మిక తనకు దాదాపు వందసార్లు ప్రపోజ్ చేసిందని విజయ్ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తానే మోకాళ్లపై కూర్చుని ఆమెకు ఉంగరం తొడిగానని వెల్లడించారు. గతంలో రష్మిక ధరించిన ఉంగరం తన స్టైల్ కాదని చెప్పడంతో కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ జంట వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ట్రోలింగ్‌పై జంట సీరియస్..

‘కాఫీ విత్ కరణ్’ షో తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌పై విజయ్, రష్మిక స్పందించారు. ఈ మేరకు తమ సోషల్ మీడియా ఖాతాల్లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు.. తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీరి టీమ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా విజయ్ జపాన్ వెకేషన్ ఫోటోలు షేర్ చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. 

మొత్తానికి విమర్శలకు దూరంగా విజయ్–రష్మిక!

ఓవైపు సోషల్ మీడియాలో విమర్శలు, మరోవైపు కుటుంబంతో హ్యాపీ మూమెంట్స్.. ఇలా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జపాన్ వెకేషన్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ‘Mine’, ‘Home’, ‘Love’ అంటూ విజయ్ ఇచ్చిన మూడు క్యూట్ క్యాప్షన్లు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఫ్యామిలీతో సరదా మూమెంట్స్, రష్మికతో రొమాంటిక్ ఫోటోలు, తల్లితో చిలిపి సందడి.. ఇలా ప్రతి ఫ్రేమ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. మొత్తానికి విమర్శల సంగతి పక్కనపెట్టి.. తమకు ఇష్టమైన వారితో జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఈ జంట ఫోటోలు అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నాయి!

ALSO READ : Ashu Reddy: పెళ్లంటే 'థూ' అనేసిన అషురెడ్డి.. వాళ్ల వల్లే మందు అలవాటైంది.. 

‘మైసా’ లుక్‌లో రష్మిక.. కత్తి పట్టుకుని సరికొత్త అవతార్!

జపాన్ వెకేషన్ ఫోటోల్లో రష్మిక కనిపించిన ఓ డిఫరెంట్ లుక్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. చేతిలో కత్తి పట్టుకుని కనిపించిన ఆమె ఫోటో రొమాంటిక్, ఫ్యామిలీ మూమెంట్స్ మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో రష్మిక నటిస్తున్న ‘మైసా’ సినిమా లుక్‌ను గుర్తుచేసుకుంటూ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. నవంబర్ 27న మూవీ థియేటర్లోకి రానుంది. 

‘రణబాలి’ తర్వాత ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీ!

ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్, రష్మిక కలిసి నటించిన ‘రణబాలి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న విడుదలైంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన నాటి కరువు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం రష్మిక ‘మైసా’తో పాటు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా.. విజయ్ కూడా తన నెక్స్ట్ మూవీ రౌడీ జనార్దన వంటి సినిమాలపై ఫోకస్ పెట్టారు.