దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. నవంబర్ 13న తీరం దాటే అవకాశం.. ఏపీకి పొంచివున్న మరో ముప్పు!

దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. నవంబర్ 13న తీరం దాటే అవకాశం.. ఏపీకి పొంచివున్న మరో ముప్పు!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం  బలహీన  పడి అక్వాన్ తుఫాన్ మారి తీరంవైపు దూసుకొస్తోంది.  నవంబర్ 19 నాటికి తీరం  దాటే అవకాశం  ఉంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ ) హెచ్చరించింది. అగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉన్న వాయుగుండం రేపు అంటే నవంబర్ 16న అక్వాన్ తుఫాన్ గా, ఎల్లుండికి తీవ్ర తుఫాన్ గా మారే ఛాన్స్ ఉంది.  నవంబర్ 19 తెల్లవారు జామున గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంలో తీరం తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.  ఈ తుఫాన్ వాయువ్యదిశగా ప్రయాణిస్తూ నవంబర్ 20 లలో ఉత్తర కోస్తా ఆంధ్రతీరం వైపు కదులుతుందని వాతావరణ శాఖ రిపోర్టులు చెబుతున్నాయి. 

 ఏపీకి పొంచివున్న మరో ముప్పు!

తుఫాను కారణంగా నవంబర్ 18 ,19  న కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కోస్తా తమిళనాడు జిల్లాలు, పుదుచ్చేరి ,కారైకల్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 16 నుంచి పశ్చిమ కనుమలు, దక్షిణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 

నవంబర్ 19 నుంచి 21 వరకు పశ్చిమబెంగాల్ లోని సౌత్ 24 పరగణా జిల్లాల్లో  భారీవర్షం కురువనుంది. మేదినీపూర్, హౌరా, పశ్చిమ మేదినీపూర్ ,ఝార్‌గ్రామ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. కోల్‌కతాలో గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ తుఫాను గమనం, తీరం దాటే ప్రాంతంపై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ ఇస్తోంది.