భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్ఏసీ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విభాగాల వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 9, టెక్నీషియన్ అప్రెంటిస్ 5 , ట్రేడ్ అప్రెంటిస్ 12,
విద్యార్హతలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ ఐటీ, ఎలక్ట్రికల్, సివిల్, ప్రొడక్షన్ తదితర విభాగాల్లో బీఈ/ బి.టెక్ లేదా సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్-ఇంజినీరింగ్ / ఇతర డిగ్రీలు): కనీసం 60 శాతం మార్కులతో బి.కాం, బీసీఏ లేదా బీఏ (హిందీ/ఇంగ్లిష్)లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటిస్( డిప్లొమా): సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఫస్ట్ క్లాసుతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు 2026, డిసెంబర్ 2 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్లకు
18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 11.
లాస్ట్ డేట్: డిసెంబర్ 2.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.sac.gov.inను సందర్శించండి.
