హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ)లో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ, రెస్పాన్స్ షీట్లతో పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ శనివారం (2026 నవంబర్ 14) విడుదల చేసింది.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని, 19వ తేదీని రిజర్వ్ డేగా ఉంచామని పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి జూన్ 2న నోటిఫికేషన్ విడుదల చేయగా, 14,489 దరఖాస్తులు వచ్చాయి.
అక్టోబర్ 26న ఎగ్జామ్ నిర్వహించగా, 30న పేపర్–1, పేపర్–2 మాస్టర్ క్వశ్చన్ పేపర్, కీని వెబ్సైట్లో ఉంచారు. దీనిపై 14 ప్రశ్నలకు సంబంధించి మొత్తం 43 అభ్యంతరాలు అందగా.. ఎక్స్పర్ట్స్ కమిటీ పరిశీలించి ఒక ప్రశ్నపై వచ్చిన 6 అభ్యంతరాలను ఆమోదించింది. మిగిలిన 13 ప్రశ్నలకు సంబంధించిన 37 అభ్యంతరాలను తిరస్కరించింది.
