విజ్ఞాన్ వర్సిటీ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

విజ్ఞాన్ వర్సిటీ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఉద్యోగ, పరిశోధన రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విజ్ఞాన్ యూనివర్సిటీ ముందుకెళ్తోందని వైస్​చాన్స్​లర్​ క్రిష్ణ కిశోర్​అన్నారు. 2027–28 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం వీ శాట్ నోటిఫికేషన్​ విడుదల చేశారు. బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 1 నుంచి మార్చి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌‌‌‌సైట్ ద్వారా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

యూనివర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌‌‌‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వీసీ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు, దరఖాస్తుల కోసం  https://admissions.vignan.ac.in  వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను సంప్రదించాలని సూచించారు.