హైదరాబాద్, వెలుగు: తెలంగాణ న్యాయవాదుల సంఘాల ఫెడరేషన్ నూతన అధ్యక్షుడిగా రంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోలి విప్లవ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ప్రధాన కార్యదర్శులుగా సుధాకర్, వై. రమేశ్, ఉపాధ్యక్షుడిగా యాదిలాల్, ముఖ్య సలహాదారులుగా హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్. సురేందర్‌రెడ్డి, ఏ. విష్ణువర్ధన్‌రెడ్డి ఎన్నికయ్యారు.
