- టీజీవో కేంద్ర సంఘం డిమాండ్
హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ కమిటీ నుంచి రిపోర్ట్ తీసుకొని ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాలని టీజీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, శ్యామ్ లు డిమాండ్ చేశారు. తెలంగాణలో రెండో పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. శనివారం నాంపల్లిలో జరిగిన టీజీవో కేంద్ర సంఘం ఈసీ మీటింగ్ కు 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, హైదరాబాద్ సిటీ నుంచి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలు తీర్మానాలు చేశారు. సంబంధిత కాపీని సీఎస్ సంజయ్ జాజుకు అందచేస్తామని అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 పని రోజులు అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు ప్రతి నెల రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలన్నారు.
