ఇండియా, పాకిస్తాన్ అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ జట్టులో ఎలాంటి మార్పుల్లేవు. శనివారం జరిగే మెగా పోరులో గెలిచి తొమ్మిదో టైటిల్‌ను సొంతం చేసుకోవాలని యంగ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో గతేడాది ఫైనల్లో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా అండర్-19 జట్టు పట్టుదలగా ఉంది.
టీమిండియా బ్యాటింగ్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో 303 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ లక్ష్య రాయ్ చందానీ, అన్వయ్ ద్రవిడ్, అర్జున్ రాజ్ పుత్ లాంటి బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడకపోతే కష్టం. బౌలింగ్‌లో పేసర్ ఇషాన్ సూద్ 4 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. అయితే స్పిన్నర్లు రాజ్ పుత్, మనాల్ చౌహాన్ కూడా రాణిస్తేనే పాక్ బ్యాటింగ్‌ను కట్టడి చేయగలం. ఉస్మాన్ ఖాన్ (238 రన్స్)పై పాక్ బ్యాటింగ్ భారీగా ఆశలు పెట్టుకుంది.
