అదానీలు, కార్పొరేట్లపై ‘వెల్త్ ట్యాక్స్’ వేయాల్సిందే: భారత్ సమిట్లో ‘ హక్కుల రక్షణ- ప్రజాధనం’ పై ప్రదర్శనలు

అదానీలు, కార్పొరేట్లపై ‘వెల్త్ ట్యాక్స్’ వేయాల్సిందే: భారత్ సమిట్లో ‘ హక్కుల రక్షణ- ప్రజాధనం’ పై ప్రదర్శనలు

హైదరాబాద్, వెలుగు: సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ (సీఎఫ్‌‌‌‌ఏ), చోరీ  సంస్థల ఆధ్వర్యంలో ‘హక్కుల రక్షణ,- ప్రజాధనం’ అనే అంశంపై భారత్​ సమిట్​ రెండో ఎడిషన్ లో  ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, ఉపాధి హామీ, ఆహార భద్రత, అటవీ హక్కుల చట్టాలు క్రమంగా నీరుగారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న పాలకులు.. పేదల సంక్షేమానికి బడ్జెట్ లో కోతలు పెడుతున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘వెల్త్ ట్యాక్స్’ వాల్‌‌‌‌పై సందర్శకులు తమ అభిప్రాయాలను స్టిక్కర్ల రూపంలో పోస్ట్ చేశారు. అదానీ వంటి బడా కార్పొరేట్లు, బిగ్‌‌‌‌టెక్ కంపెనీలు, బహుళజాతి సంస్థలపై తక్షణమే భారీగా ‘సంపద పన్ను (వెల్త్ ట్యాక్స్)’ విధించాలన్నారు. సంపన్నుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ధనాన్ని మౌలిక వసతులు, పేదల ఆరోగ్యం, ఉచిత విద్య, కౌలురైతుల సంక్షేమానికి మళ్లించాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు 3 ప్రధాన డిమాండ్లను ఉంచారు.