బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు దర్శకుడితో కలిసి సినిమా చేయబోతోంది. శుక్రవారం ఈ హారర్ థ్రిల్లర్‌ను అధికారికంగా ప్రకటించారు. డిఫరెంట్ మూవీస్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించనున్నాడు.
‘స్కేరీ పిక్చర్’ అనే టైటిల్‌తో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని డి.రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్స్‌పై సురేష్ బాబు, రవిబాబు నిర్మించనున్నారు. హారర్ థ్రిల్లర్స్ తెరకెక్కించడం రవిబాబుకు కొత్తేమి కాదు. ఇక కంగనా రనౌత్ కూడా రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్, చంద్రముఖి 2 లాంటి థ్రిల్లర్స్‌లో నటించింది.
అయితే ఈసారి ఎలాంటి పాత్రలో ఆమె కనిపించబోతోందా, రవిబాబు కంగనను ఎలా ప్రజెంట్ చేయబోతున్నారా అనే ఆసక్తి నెలకొంది. 2027లో ఎప్పుడైనా సినిమా విడుదల ఉండొచ్చు అని ప్రకటించారు. గతంలో ప్రభాస్‌తో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఏక్ నిరంజన్’లో హీరోయిన్‌గా నటించిన కంగన.. పదిహేడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు డైరెక్టర్‌తో వర్క్ చేయబోతుండటం విశేషం.
A new nightmare is about to unfold. Dr. D. Ramanaidu presents SCARY PICTURE, starring Kangana Ranaut. A Flying Frogs Production. D. Suresh Babu | Ravi Babu ANYTIME 2027. #ScaryPicture @KanganaTeam @SureshProdns #FlyingFrogs #ScaryPicture2027 https://t.co/FbTWIvJ1rL
— Suresh Productions (@SureshProdns) November 13, 2026
