GV Prakash Kumar: ‘ఆకాశంలో ఒకతార’ పాటలకు జాతీయ అవార్డు పక్కా.. జీవీ ప్రకాష్‌కు అంత నమ్మకం ఎందుకు?

GV Prakash Kumar: ‘ఆకాశంలో ఒకతార’ పాటలకు జాతీయ అవార్డు పక్కా.. జీవీ ప్రకాష్‌కు అంత నమ్మకం ఎందుకు?

దుల్కర్ సల్మాన్‌‌‌‌, సాత్విక వీరవల్లి జంటగా పవన్ సాధినేని రూపొందిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒకతార’.  శృతిహాసన్ కీలక పాత్ర పోషిస్తోంది.  గీతా ఆర్ట్స్‌‌‌‌,  స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ 20న సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ‘ఇదొక ఎమోషనల్, ఇన్‌‌‌‌స్పిరేషనల్ ఫిల్మ్.  ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ప్రతి మహిళ ఇష్టపడుతుంది. ఇది మోడర్న్ క్లాసిక్‌‌‌‌ మూవీగా నిలిచిపోతుంది.  దుల్కర్ కెరీర్‌‌‌‌లోనూ  చాలా స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్స్ కూడా వస్తాయని నమ్ముతున్నా.  ఈ సినిమా కోసం చాలా ప్రత్యేకమైన మ్యూజిక్‌‌‌‌ను క్రియేట్ చేశాం. పాటలు, బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోర్ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మొత్తం ఐదు పాటలున్నాయి. శ్రుతి హాసన్‌‌‌‌తో ఒక పాట పాడించాం. తను అద్భుతంగా పాడారు.

ఈ సినిమాలో డిఫరెంట్ సౌండ్ జోన్‌‌‌‌ను పరిచయం చేశాం. మ్యూజిక్ చాలా ఐకానిక్‌‌‌‌గా ఉంటుంది.  తెలుగు పరిశ్రమలో దర్శకులు కొత్త కొత్త జానర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ నేను చేస్తున్న సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తుండటంతో అవకాశాలు పెరుగుతున్నాయి. అలాగే నటుడిగా, సంగీత దర్శకుడిగా కెరీర్ కొనసాగించడం సవాల్‌‌‌‌గా అనిపించదు.  రెండు నెలల ముందే నా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాను. నెలలో 15 రోజులు మ్యూజిక్‌‌‌‌కు, మరో 15 రోజులు నటనకు కేటాయిస్తాను.  ప్రస్తుతం పలు ఆసక్తికరమైన సినిమాలకు సంగీతం అందిస్తున్నా’ అని చెప్పాడు. 

ఇప్పటికే విడుదలైన ‘రాధే రాధే’ పాటకు మంచి స్పందన వస్తుండటంతో సినిమాపై సంగీతపరమైన అంచనాలు పెరిగాయి. మరి జీవీ ప్రకాష్ నమ్ముతున్నట్లుగా ‘ఆకాశంలో ఒకతార’ జాతీయ అవార్డులను అందుకుంటుందా? ఆయన రూపొందించిన సంగీతం ప్రేక్షకుల మనసులను ఎంతవరకు గెలుచుకుంటుందో తెలియాలంటే నవంబర్ 20 వరకు వేచి చూడాల్సిందే.

టాలీవుడ్‌లో జీవీ ప్రకాష్ జోరు..

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆయన.. ‘ఇరుముడి’తోనూ తన సంగీత ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒకతార’, ‘శ్రీ శ్రీ’, ‘జనవరి 12 విడుదల’ వంటి ఆసక్తికరమైన సినిమాలకు పనిచేస్తున్నారు. తెలుగులో తాను చేస్తున్న సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తుండటంతో అవకాశాలు పెరుగుతున్నాయని జీవీ ప్రకాష్ తెలిపారు. సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ కొనసాగుతున్న ఆయన.. రెండు రంగాలకు సమయం కేటాయిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. మొత్తానికి టాలీవుడ్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలనే లక్ష్యంతో జీవీ ప్రకాష్ సాగుతున్నారు.