రాయికోడ్: భార్యపై భర్త కర్రతో దాడి..చికిత్స పొందుతూ మృతి

రాయికోడ్: భార్యపై భర్త కర్రతో దాడి..చికిత్స పొందుతూ మృతి

రాయికోడ్, వెలుగు:  భార్యపై భర్త కర్రతో దాడి చేయడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో శుక్రవారం జరిగింది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోహీర్ మున్సిపల్ పరిధిలోని మిషన్ కాంపౌండ్‌‌కు చెందిన నాగరిగారి భాగ్యమ్మ (30)కు 15 ఏండ్ల కింద సురేశ్ అలియాస్ జైపాల్‌‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

కొంతకాలంగా సురేశ్​మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వాలని భార్యను తరచూ   వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భాగ్యమ్మను సురేశ్ వంటకు వాడే బాబుల్ కర్రతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు కోహీర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ భాగ్యమ్మ చనిపోయింది. భాగ్యమ్మ అక్క బైకాడి శకుంతల ఫిర్యాదు మేరకు కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.