రామచంద్రాపురం, వెలుగు : లింగంపల్లి చౌరస్తా నుంచి అమీన్పూర్ వైపు నిర్మిస్తున్న కొత్త రోడ్డుతో దశాబ్దాల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని లింగంపల్లి వద్ద కొనసాగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారి నుంచి అమీన్‌పూర్‌కు కనెక్టివిటీని కల్పిస్తున్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అమీన్పూర్ ప్రజల చిరకాల వాంచ నేరవేస్తున్నామని చెప్పారు. బంధంకొమ్ము చెరువు వద్ద రోడ్డు విస్తరణకు ఇరిగేషన్ నుంచి అనుమతులు లభించాయని, మొత్తం వంద ఫీట్ల రోడ్డుగా కొత్త రోడ్డు నిర్మించబోతున్నామని తెలిపారు. లింగంపల్లి నాలా వద్ద అక్రమ నిర్మాణాలను తొలగించి రోడ్డుకు మార్గం సుగమం చేశామన్నారు.
అనంతరం పటాన్చెరు పీఎఫ్ కార్యాలయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పటాన్చెరు పీఎఫ్ ఆఫీస్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నారనే ప్రచారంతో ఆయన అధికారులతో నేరుగా మాట్లాడారు. కొత్త కార్యాలయం కోసం కర్ధనూర్‌లో భూమి కేటాయింపునకు కలెక్టర్‌తో మాట్లాడుతున్నామని, ప్రస్తుతం ఉన్న ఆఫీస్‌లో సమస్యల వల్ల పటాన్చెరు బస్టాండ్‌లో ఐదో అంతస్తులో పీఎఫ్ కార్యాలయం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. విద్యుత్, ఇంటర్నెట్ ఇతర మౌలిక సౌకర్యాల ఇబ్బందులు ఉన్నందున కొంతకాలం కొత్తగూడ నుంచి కార్యకలాపాలు కొనసాగుతన్నాయని, పీఎఫ్ ఆఫీస్ తరలింపుపై అపోహలు వద్దని ఎంపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో దిశ కమిటీ మెంబర్ కాసాల సుధాకర్, బీజేపీ జిల్లా సెక్రటరీ కొల్కూరి రాజశేఖర్ రెడ్డి, తెల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ రాంబాబు గౌడ్, నర్సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
