మెదక్/సిద్దిపేట రూరల్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంతగడ్డ సిద్దిపేటలో ఆయన కుమార్తె, తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం పర్యటించనున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత సిద్దిపేటలో జిల్లా పార్టీ ఆఫీస్నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న రంగధాంపల్లి చౌరస్తా సమీపంలో ఆఫీస్నిర్మించనున్నారు.
పర్యటనలో భాగంగా ముందుగా ఉమా పార్థివ కోటిలింగేశ్వరస్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఇక్బాల్ మినార్ సమీపంలోని జానుల్లా షా దర్గాలో చాదర్ సమర్పించి, ఆర్డీవో ఆఫీస్సమీపంలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఉదయం 10 గంటలకు రంగధాంపల్లి చౌరస్తాకు చేరుకుని పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి.
