కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి మండలం కైత్లాపూర్ పరిధిలోని కైత్లాపూర్చెరువు ఎఫ్టీఎల్పరిధిలోని రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. గతంలో ఆక్రమణకు గురైన 9.06 ఎకరాల ఎఫ్టీఎల్భూమి చుట్టూ గురువారం ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్వేసే క్రమంలో జేసీబీ ఆపరేటర్గ్రామానికి చెందిన శ్మశానవాటికలోని కొన్ని సమాధులను కూడా తొలగించటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీంతో గ్రామస్తులు అక్కడకు వచ్చి హైడ్రా అధికారులతో వాగ్వివాదానికి దిగారు. శ్మశానవాటిక స్థలాలను తొలగించలేదని, ఎఫ్టీఎల్ స్థలానికి మాత్రమే ఫెన్సింగ్ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
పొరపాటున జేసీబీ ఆపరేటర్చూసుకోకుండా చేసి ఉండొచ్చని వివరణ ఇచ్చారు. అయినా వారు శాంతించలేదు. కూకట్పల్లి పోలీసులు వచ్చి స్థానికులకు సర్దిచెప్పి పంపించారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
