దోహా: ఇండియా షూటర్ వివాన్ కపూర్.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో డబుల్ ధమాకా సాధించాడు. గురువారం జరిగిన మెన్స్ ట్రాప్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్‌తో పాటు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ బెర్త్‌ను సాధించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో వివాన్ 29–29తో అబ్దుల్ రెహమాన్ అల్ఫైహాన్ (కువైట్)తో సమంగా నిలిచాడు.
తర్వాత జరిగిన షూటాఫ్‌లో స్వల్ప తేడాతో ఓడిన వివాన్ సిల్వర్‌కు పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన నాలుగో ట్రాప్ షూటర్‌గా వివాన్ రికార్డులకెక్కాడు. కర్నీ సింగ్ (సిల్వర్), మానవ్‌జీత్ సింగ్ సంధు (గోల్డ్), జొరావర్ సింగ్ సంధు (బ్రాంజ్) ముందున్నారు. ఇక ఇండియా తరఫున ఒలింపిక్స్ కోటా సాధించిన మూడో షూటర్ వివాన్.
