టాప్ సీడ్‌కు చెక్ పెట్టినకిడాంబి శ్రీకాంత్‌.. ప్రిక్వార్టర్స్‌లో అదిరే విజయం

టాప్ సీడ్‌కు చెక్ పెట్టినకిడాంబి శ్రీకాంత్‌.. ప్రిక్వార్టర్స్‌లో అదిరే విజయం

కుమమొటో (జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): ఇండియా వెటరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21–15, 11–21, 21–18తో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనిమిదో ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐదోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొడై నరోకా (జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీ.. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడినా చివరి వరకు పట్టువిడవకుండా పోరాడాడు. 

బలమైన స్మాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు ర్యాలీలతో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21–18, 21–14తో డాంగ్ టియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యావో (చైనా)పై నెగ్గి ముందంజ వేశాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీసా జాలీ–గాయత్రి గోపీచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14–21, 14–21తో రిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవానాగ–కియో నకానిషి (జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడారు. క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. కొకి వతనాబేతో, లక్ష్య.. యుషి తనకాతో తలపడతారు.