రావల్పిండి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ అరంగేట్రం పేసర్ సాకిబ్ ఖాన్ (7/130) తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. దాంతో నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన పాక్ ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 21.2 ఓవర్లలో 57/1 స్కోరు చేసింది. అజాన్ అవైస్ (22 బ్యాటింగ్), మహ్మద్ తాహా (24 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 404/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన లంక తొలి ఇన్నింగ్స్‌లో 117.2 ఓవర్లలో 446 రన్స్‌కు ఆలౌటైంది.
