బుడాపెస్ట్: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. టోటల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించాడు. గ్రూప్–డిలో భాగంగా గురువారం ఫాస్ట్ క్లాసికల్ విభాగంలో హన్స్ నీమన్ (అమెరికా)తో జరిగిన రెండు గేమ్‌లను అర్జున్ డ్రా చేసుకున్నాడు. గ్రూప్–బిలో ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద కూడా.. విన్సెంట్ కీమర్ (జర్మనీ)తో జరిగిన రెండు గేమ్‌లను డ్రాగా ముగించాడు. ప్రస్తుతం అర్జున్, ప్రజ్ఞా ఖాతాలో చెరో రెండు పాయింట్లు ఉన్నాయి.
విమెన్స్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి ఆరంభంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమ్ వాచియర్ లాగ్రేవ్‌తో జరిగిన తొలి గేమ్‌లో ఓడిన వైశాలి.. రెండో గేమ్‌ను డ్రా చేసుకుంది. దాంతో ఒక్క పాయింట్‌ను సాధించింది. వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే).. అనిష్ గిరి (నెదర్లాండ్స్)తో జరిగిన రెండు గేమ్‌లను డ్రా చేసుకున్నాడు.
