జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత కీలకమైన, శక్తిమంతమైన గ్రహాలు నాగుల చవితి వేళ రాహువు కుంభరాశిలో.. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు . ఈ రెండు గ్రహాలు మానవ సంబంధాలు, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత ఆలోచనలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వీటి ప్రభావం వలన ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .!
మేష రాశి : నాగుల చవితి వేళ రాహువు కుంభ రాశిలో.. కేతువు సింహరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండనుంది. ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి చేపడతారు.ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో వేతనం పెరిగే అవకాశం ఉంది. కేరీర్ లో ఉన్నతస్థానాన్ని పొందుతారు. ఇప్పటి వరకు మిమ్మలను వ్యతిరేకించిన వారే మీ సహాయాన్ని అర్దిస్తారు. ఆకస్మికంగా ధనలాభం పొందుతారు. ప్రేమ.. పెళ్లి మొదలగు అంశాలు కలసి వస్తాయి.
వృషభ రాశి: నాగులచవితి రోజున రాహు కుంభ రాశిలో కేతువు సింహరాశిలో సంచారం వలన ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గ్రహాల సంచారం వలన వీరికి సానుకూల శక్తిని పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. వీరు తల పెట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు చాలా అనుకూలంగా ఉంది. విదేశీ వ్యాపారం చేసే వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తాయి. కొత్తగా ఇల్లు కట్టేందుకు అంకురార్పణ చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. సహోద్యోగల అండదండలు ఉంటాయి. మీ బాస్ మీకు కొన్ని కీలకమైన పనులు అప్పగించే అవకాశం ఉంటుంది. ఇది మీ లైఫ్ నకు టర్నింగ్ పాయింట్ కూడా అవ్వవచ్చు. కాబట్టి అదనపు బాధ్యతలను ఇష్టంగా స్వీకరించండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిథున రాశి : రాహువు కుంభ రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది.
ఉద్యోగంలో జీతాల పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వారికి ఇది అనుకూల సమయం. ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి. ప్రతి ప్రయత్నంలో విజయావకాశాలు పెరుగుతాయి.జీవితభాగస్వామికోసం సమయాన్ని కేటాయిస్తారు. ఆర్థికంగా పురోభివృద్ది ఉంటుంది. కొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆనందంతో పాటు సంపద పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తికావడంతో కొంత ఊరట కలుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
కర్కాటక రాశి : రాహువు కుంభరాశిలో సంచరించే సమయంలో నాగుల చవితి ఘడియలు ఉన్నాయి. అలాగే కేతువు సింహరాశిలో సంచారంచడం వలన ఈ రాశి వారికి అనుకోకుండా ప్రయాణాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.ప్రతి విషయం ఛాలెంజ్‌గా ఉంటుంది. వ్యాపారం కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఉద్యోగస్తులు అనవరంగా మాట పడతారు. అందరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడుతాయి. ఆస్తుల మధ్య వివాదాలు వస్తాయి. ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు పెరుగుతాయి. మీ కుటుంబంలో కలహాల వల్ల సంతోషం ఉండదు. స్థిరాస్తులకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతాయి.
సింహ రాశి : ఇదే రాశిలో కేతువు సంచారం .. నాగులచవితి పర్వదినాన రాహువు కుంభ రాశిలో సంచారం వలన ఈ రాశి వారు చాలా ఓర్పుగా ఉండాలి. ఆర్థిక పరంగా సమస్యలు ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు. అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీలో మీరే కూర్చుని పరిష్కరించుకోండి.. మూడో వ్యక్తి దగ్గరకు పరిష్కారం కోసం వెళ్లవద్దని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి. ప్రేమికులు ఎలాంటి సంభాషణలు.. మీటింగ్ లు పెట్టుకోకపోవడమే మంచిది. ఉద్యోగస్తులు ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఓర్పు .. సహనం పాటించండి.. చివరకు అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు.
కన్య రాశి : రాహువు కుంభరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అనుకున్న పనులు కొంచెం నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఖర్చులు పెరుగుతాయి. కెరీర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్లు వస్తాయి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు కష్ట పడాల్సి ఉంటుంది. కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
►ALSO READ | ఓజోన్ పొరకు భారీ రంధ్రం.. భూమికి పొంచి ఉన్న ముప్పు
తులా రాశి : రాహువు కుంభరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో కీర్తి.. గౌరవం.. ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడంతో .. ఇబ్బందులు తీరుతాయి. కొన్ని కొత్త వనరులు ఏర్పడుతాయి. కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం ... కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది. అనుకోకుండా లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టే వారు ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది
వృశ్చిక రాశి : నాగుల చవితి రోజు కుంభరాశిలో రాహువు సంచారం వలన ఈ రాశి వారికి అశాంతి పరిస్థితులు ఏర్పడుతాయి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. ప్రశాంతంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.. నిదానంగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు చాలా సమయం ఓపికగా ఉండాలి. విదేశీ ప్రయాణం.. వ్యాపారానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా మారతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిదానంగా ప్రతికూలత ప్రభావం తగ్గడంతో ..కొంత ఉపశమనం కలుగుతుంది.
ధనుస్సు రాశి : రాహువు కుంభ రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి. ధైర్యసాహసాలు పెరిగి వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఆర్థికంగా కలసి వస్తుంది.ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలసి వస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెడితే ఆర్థిక లాభాలు కలసి వస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్టర్నింగ్ పాయింట్ అవుతుంది.
మకర రాశి : రాహువు కుంభరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇతరులతో మాట్లడేటప్పుడు సంయమనం పాటించాలి. కోపం.. అసహనం పెరిగే అవకాశం ఉంది. కార్యాలయంలో కొన్ని ప్రతికూల పరిస్థితుల వలన ఆందోళన కలిగే అవకాశం ఉంది. వాహనం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు ఆలస్యం కావడం.. రావలసిన డబ్బులు చేతికి అందకపోవడం.. ఖర్చులు పెరగడం వలన ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. ఒక్కోసారి అన్నీ వదిలేసి ఎటో వెళ్లిపోవాలని అనిపిస్తుందని పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి : ఈ రాశికి జన్మలగ్నంలో రాహువు సంచరించడం వలన వీరి వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి, మానసిక ఆందోళనలు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.కెరీర్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు చాలా ఓపికకగా ఉండాలి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు..
మీన రాశి:రాహువు కుంభరాశిలో.. కేతువు సింహ రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అనవసర ఖర్చులు, నిద్రలేమి సమస్యలు ఏర్పడుతాయి.మానసిక ఒత్తిడి, భావోద్వేగాల తీవ్రత అధికంగా ఉంటుంది. వృత్తి పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కుటుంబ సంబంధాల్లో, మాటతీరులో కాస్త సంయమనం పాటించాలి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని... ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని సమాచారాన్నా జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
