సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీలోని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. 2026, నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం కోర్టు విచారణకు హాజరయ్యారు. 2021లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో.. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ FIR నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో భాగంగానే నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.
2021 ఏప్రిల్ 11వ తేదీన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం జరిగింది. అప్పట్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్కులు ధరించకుండా.. కరోనాకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు కేసు నమోదైంది. ఈ కేసు నాంపల్లిలోని ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) 313 కింద నిందితుల వాంగ్మూల నమోదు ప్రక్రియ కోసం స్వయంగా కోర్టుకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.
