ఏడు కోట్లు ఇవ్వండి.. లేకుంటే చంపేస్తాం.. కేజ్రీవాల్ కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

ఏడు కోట్లు ఇవ్వండి.. లేకుంటే చంపేస్తాం.. కేజ్రీవాల్ కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

ఢిల్లీ మాజీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్  కేజ్రీవాల్ చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. విదేశాల నుంచి వాట్సాప్ కాల్ చేసిన దుండగులు డబ్బులు డిమాండ్ చేశారు.  తాము అడిగిన ఏడు కోట్లు ఇవ్వకపోతే కేజ్రీవాల్ తో సహా ఆయన కుమార్తెను చంపేస్తామని బెదిరించారు.  నవంబర్ 6న బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడనని, విదేశాలనుంచి ఫోన్ చేస్తున్నానని బెదిరించినట్లు ఢిల్లిలోని తిలక్ నగర్  ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

విదేశాల్లో  ఉంటున్న బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్న దుండగుడు.. రూ. 7 కోట్లు డిమాండ్ చేశాడని, డబ్బు చెల్లించకపోతే కేజ్రీవాల్, అతని కుమార్తె హర్షిత కేజ్రీవాల్‌లను చంపేస్తానని బెదిరించాడని సింగ్ గురువారం (నవంబర్ 12) ఢిల్లీ ఫోలీసులకు ఫిర్యాదు చేశారు.బీఎన్ఎస్ ,ఐటీ చట్టం రెండింటి కింద కేసు నమోదు చేసి, సైబర్ క్రైమ్ యూనిట్‌కు కేసును మొహాలీ పోలీసులు అప్పగించారు. బెదిరింపులకు పాల్పడింది బిష్ణోయ్ గ్యాంగేనా, లేక మరేదైన ఫేక్ కాల్ అయి ఉండొచ్చా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు