ఇంటి అద్దెల పెరుగుదల,పెరుగుతున్న జీవన వ్యయం, ఇళ్ల కొరతలకు నిరసనగా స్పెయిన్ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో అట్టుడుకిపోయింది. సమ్మె కారణంగా మాడ్రిడ్, బార్సిలోనా వంటి ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా రైళ్లు, బస్సుల రాకపోకలు స్తంభించాయి. ఫ్యాక్టరీలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. వేతనాలు, నివాసం, ధరలు (Wages, Housing, Prices) అనే నినాదాలతో స్పెయిన్ లోని నగరాలు హోరెత్తాయి. ప్రధాన కార్మిక సంఘాలు అయిన UGT ,CCOO, రెంటర్స్ కార్మికసంఘాలు ఈ 24 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. నవంబర్ 29న స్పెయిన్లో జరగనున్న ముందస్తు సార్వత్రిక ఎన్నికల ముందు ఈ సమ్మె ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత 14 ఏళ్లలో స్పెయిన్లో దేశవ్యాప్త సమ్మె ఇదే మొదటిది. ఇంటి అద్దెలు, సామాన్యులకు సొంతిల్లు, పెరుగుతున్న జీవన వ్యయం ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ అంశంగా మారాయి.
సమ్మెకు ప్రధాన కారణాలు:
గృహ సంక్షోభం (Housing Crisis): అద్దెలు విపరీతంగా పెరిగిపోవడం, సొంతిల్లు కొనుగోలు సామాన్యులకు అందనంత దూరంగా వెళ్లడం, ఇళ్ల కొరత ఈ సమ్మెకు ప్రధాన కారణమయ్యాయి. మరోవైపు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో సమ్మెకు దారితీశాయి. వేతనాలు, ఇళ్లు, ధరలు అనే నినాదంతో కార్మికులు రోడ్డెక్కి దేశవ్యాప్త సమ్మెకు దిగారు.
ప్రజల దేశవ్యాప్త సమ్మెకు స్పెయిన్ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రధాన కార్మిక సంఘాలైన UGT, CCOO ఆధ్వర్యంలో సుమారు 40 లక్షల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు యూనియన్లు వెల్లడించాయి. ఈ 24 గంటల సమ్మె కారణంగా మాడ్రిడ్, బార్సిలోనా వంటి ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా రైళ్లు, బస్సుల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫ్యాక్టరీలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
నవంబర్ 29న స్పెయిన్లో ముందస్తు సార్వత్రిక ఎన్నికలు (Snap Election) జరగనున్న తరుణంలో ఈ సమ్మె ప్రాధాన్యత సంతరించుకుంది. గృహ సంక్షోభం ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ అంశంగా మారింది. బార్సిలోనా వంటి కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. రియల్ ఎస్టేట్ ఆఫీసులపై దాడి, రోడ్లపై టైర్లు తగలబెట్టడం వంటి సంఘటనలతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు.
