పాక్ డిప్యూటీ పీఎం మనుమడిపై.. రేప్ కేసు

పాక్ డిప్యూటీ పీఎం మనుమడిపై.. రేప్ కేసు

లాహోర్: పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ మనుమడు మహమ్మద్ రజాదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మరో ఏడుగురిపై లాహోర్ కోర్టు గ్యాంగ్​రేప్​ ఆరోపణలు చేసింది. ఇద్దరు విదేశీ మహిళలను కిడ్నాప్ చేసి గ్యాంగ్​రేప్​కు పాల్పడినట్లు అభియోగం మోపింది. ఈ కేసులో డిసెంబర్ 9న సాక్షుల విచారణ ప్రారంభం కానుంది. 2025లో సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రజా దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసిన నెదర్లాండ్స్, వెనిజులాకు చెందిన ఇద్దరు మహిళలు.. తాము నిర్వహిస్తున్న క్రిప్టోకరెన్సీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దీంతో రజాదార్ రూ.5 లక్షల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత సరైన లాభాలు రాకపోవడంతో ఆ మహిళలను జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రప్పించారు.

లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ఇంటిలో వారిని బందించి తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. బలవంతంగా19,500 డాలర్లు బదిలీ చేయించుకున్నారు. నిందితులు ఆ బాధితులను కారులో లాహోర్ విమానాశ్రయానికి తరలిస్తున్న సమయంలో వాహనానికి ప్రమాదం జరిగింది. ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని బాధితులు పరారయ్యారు. వైద్య పరీక్షల్లో మహిళలపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కావడంతో కోర్టు ఈ నేరారోపణలను ఖరారు చేసింది.