ఒరేయ్ పిల్లలూ.. అది జారుడు బల్ల కాదురా.. 20 అడుగుల కొండచిలువరా.. ఈ వీడియో చూడండి !

ఒరేయ్ పిల్లలూ.. అది జారుడు బల్ల కాదురా.. 20 అడుగుల కొండచిలువరా.. ఈ వీడియో చూడండి !

ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ ఎన్నో వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. ఇండోనేషియాకు చెందిన ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పామును చూస్తేనే చాలామంది భయంతో పరుగులు తీస్తారు. ఈ పిల్లలు ఏకంగా దాదాపు 20 అడుగుల కొండ చిలువతో జారుడు బల్ల ఆట ఆడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఘటన నిజంగా జరిగిందని కొందరు అంటుంటే.. AI వీడియో అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంతకీ.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏముందంటే.. సుమారు 20 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ కనిపించింది. ఆ కొండచిలువపై పిల్లలు కూర్చొని, దానిని స్లైడర్‌లా వాడుకుని జారుతున్నారు. మరికొందరు పిల్లలు పాము చుట్టూ తిరుగుతూ సరదాగా గడుపుతున్నారు. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

వీడియోలో కనిపిస్తున్నది రెటిక్యులేటెడ్ పైథాన్ (Reticulated Python) జాతికి చెందిన కొండచిలువగా తెలుస్తోంది. ఇవి ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము జాతుల్లో ఒకటి. విషం లేకపోయినప్పటికీ, వీటి శరీరంలో అపారమైన కండర బలం ఉంటుంది. చుట్టుకుని బిగించి చంపగల సామర్థ్యం వీటి సొంతం. ఈ వీడియో సరదాగా అనిపించినప్పటికీ.. ఇలాంటి చర్యలు ఏమాత్రం సురక్షితం కావు. పాము ప్రశాంతంగా కనిపించినా ఎప్పుడైనా దాడి చేయవచ్చు. తనకు ప్రమాదం ఉందని భావిస్తే పాము శరీరంతో చుట్టుకుని బిగించే అవకాశం ఉంది. ఒక ప్రాణిని ఇలా హింసించడం ఏమాత్రం సరికాదని వన్య ప్రాణి ప్రేమికులు ఈ వీడియోపై నిట్టూర్చారు.