ఇజ్రాయెల్ పార్లమెంట్‎లో ఉద్రిక్తత.. మాజీ ప్రధానిని బండ బూతులు తిట్టిన నెతన్యాహు భార్య..!

ఇజ్రాయెల్ పార్లమెంట్‎లో ఉద్రిక్తత.. మాజీ ప్రధానిని బండ బూతులు తిట్టిన నెతన్యాహు భార్య..!

జెరూసలెం: ఇజ్రాయెల్ పార్లమెంటులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తగా ఎన్నికైన చట్టసభ సభ్యుల ప్రమాణ స్వీకారం  వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌‎పై బెంజమిన్ నెతన్యాహు భార్య, ఎంపీ సారా నెతన్యాహు విరుచుకుపడ్డారు. యూజ్‎లెస్ ఫెలో, షేమ్ ఆన్ యూ అంటూ బూతుల వర్షం కురిపించారు. బెంజమిన్ నెతన్యాహు ప్రసంగిస్తుండగానే ఈ వాగ్వాదం చోటు చేసుకోవడం గమనార్హం. 

2026, నవంబర్ 10న కొత్తగా ఎన్నికైన పార్లమెంటు ప్రారంభ సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన చట్టసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తాత్కాలిక ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగిస్తూ.. ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో అరబ్ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఖతార్ భారీ మొత్తంలో ఖర్చు చేసిందన్న ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌ నెతన్యాహు ప్రసంగానికి అడ్డు తగిలారు. 

2023, అక్టోబర్ 7న జరిగిన దాడిపై రాష్ట్ర విచారణ కమిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ, నెతన్యాహు సలహాదారులకు ఖతార్‌తో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధాలపై ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు నెతన్యాహు సహాయకులలో ఇద్దరు ఖతార్ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. 

నువ్వో పనికిమాలిన వాడివి.. నీకు సిగ్గుండాలి:

నెతన్యాహు భార్య సారా నెతన్యాహు బెన్నెట్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబ్ పార్టీలతో బెన్నెట్‎కు ఉన్న రాజకీయ సంబంధాలను ప్రస్తావిస్తూ ఆమె మండిపడ్డారు. ‘‘నువ్వు అరబ్ జాయింట్ లిస్ట్‌తో కలిసి కూర్చుంటావు. నువ్వో పనికిమాలిన వాడివి. నీకు సిగ్గుండాలి’’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

►ALSO READ | దాడులు చేయం.. పీస్ డీల్ కుదుర్చుకోం: ఇరాన్‎పై ట్రంప్ కొత్త ప్లాన్..! 

జాతీయ భద్రతా మంత్రి ఇతామార్ బెన్-గ్విర్ కూడా బెన్నెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెన్నెట్, సారా నెతన్యాహు, బెన్-గ్విర్ మాటల యుద్ధంతో పార్లమెంట్‎లో గందరగోళం నెలకొంది. నెతన్యాహు ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. స్పీకర్ అమీర్ ఒహానా సభ్యులను శాంతింపజేసి హౌస్‎ను కంట్రోల్‎లోకి తెచ్చారు. అనంతరం నెతన్యాహు తన ప్రసంగాన్ని కొనసాగించారు.