15 సెకన్లలో 30 రౌండ్ల కాల్పులు.. కుల్గామ్ లో CRPF క్యాంప్ పై ఉగ్రదాడి..!

15 సెకన్లలో 30 రౌండ్ల కాల్పులు.. కుల్గామ్ లో CRPF క్యాంప్ పై ఉగ్రదాడి..!

కుల్గామ్ లోని CRPF క్యాంప్ పై ఉగ్రదాడి జరిగింది. బుధవారం ( నవంబర్ 11 ) మధ్యాహ్నం జరిగింది ఈ దాడి. 15 సెకన్ల వ్యవధిలోనే 30 రౌండ్ల కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని సమాచారం. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

కుల్గాంలోని  మిర్ బజార్ సమీపంలోని అఖ్రాన్‌లో ఉన్న CRPF క్యాంప్‌పై మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. తీవ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపి అక్కడ నుంచి పారిపోయారని CRPF ప్రకటనలో పేర్కొంది. సంఘటన CCTV కెమెరాలో రికార్డయింది. ఆ ఫుటేజ్‌లో 15 సెకన్ల వ్యవధిలో దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిగినట్లు కనిపిస్తోంది.

గాయపడిన జవాన్లు రాకేష్ దాస్, సంతోష్ చంద్రు, సోమ్‌వీర్ సింగ్‌లను అనంతనాగ్ జిల్లాలోని హాస్పిటల్‌కు తరలించారని CRPF చెప్పింది. రాకేష్ దాస్‌కు ఎడమ కాలికి గాయమైంది. సంతోష్ చంద్రుకు పొట్ట మరియు వెన్నెముకకు గాయాలయ్యాయి. సోమ్‌వీర్ సింగ్‌కు ఎడమ చేతికి గాయమైంది. ముగ్గురూ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపారు.

►ALSO READ | గవర్నమెంట్ టీచర్స్.. ఇద్దరికీ రెండో పెళ్లి.. దీపావళికి ఇంటికి వెళ్లి.. ఇంతలోనే విషాదం !

దాడి జరిగిన సమయంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కుల్గామ్‌లోనే ఉన్నారు. అయితే ఆయన దాడి జరిగిన స్థలానికి దూరంగా ఉన్నారు.దాడి జరిగిన వెంటనే భద్రతా దళాలు అదనపు బారికేడ్లు ఏర్పాటు చేశాయి. బాధితులైన జవాన్లను స్ట్రెచర్లపై ఆసుపత్రికి తరలించే దృశ్యాలు నమోదయ్యాయి. ఆర్మర్డ్ వాహనాల్లో రీన్‌ఫోర్స్‌మెంట్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. స్థానికులను ఇళ్ళల్లో ఉండమని లౌడ్‌స్పీకర్ ద్వారా ప్రకటనలు చేశారు.