పెళ్లి కంటే మనశ్శాంతే ముఖ్యం.. విడాకులపై తరుణ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు.!

పెళ్లి కంటే మనశ్శాంతే ముఖ్యం.. విడాకులపై తరుణ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు.!

'పెళ్లి చూపులు','ఈ నగరానికి ఏమైంది' వంటి విభిన్నమైన సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్.  ప్రస్తుతం విశ్వక్ సేన్‌తో కలిసి 'ఈ నగరానికి ఏమైంది రిపీట్'(ఈఎన్ఈ రిపీట్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, ప్రేమ, విడాకులు, రిలేషన్‌షిప్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

'పెళ్లి చూపులు' సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు తరుణ్ ఆసక్తికరంగా స్పందించారు. ఈ సినిమాకి వచ్చిన టెన్షన్‌కే తట్టుకోలేకపోతున్నా. మళ్లీ సీక్వెల్ అంటే నా లైఫ్ స్పాన్‌లో రెండేళ్లు తగ్గినట్లే. అంచనాలు లేకుండా సినిమా చేయడంలోనే అసలైన ప్రశాంతత ఉంటుంది అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.

ఇక పెళ్లి వ్యవస్థపై తన అభిప్రాయాన్ని చెబుతూ మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రతి మనిషికీ ఒక తోడు ఉండాలి. ఇద్దరు ఇష్టపడి కలిసి జీవించాలనుకుంటే వాళ్లను అలాగే ఉండనివ్వాలి. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇష్టం లేకపోయినా జీవితాంతం కలిసి ఉండాల్సిన అవసరం లేదు. మాట్లాడుకోకుండా, సంతోషం లేకుండా బంధాన్ని కొనసాగించడం సమయం వృథా చేసుకోవడమే. పరస్పర గౌరవంతో విడిపోవడంలో తప్పేమీ లేదు' అని అభిప్రాయపడ్డారు.

అంతేకాదు, విడాకుల తర్వాత మరో భాగస్వామిని ఎంచుకోవడంపై సమాజంలో ఉన్న భయాలు, అపోహలపైనా మాట్లాడారు. ఈ అంశంపై రొమాంటిక్ కామెడీ కాకుండా ఒక మంచి డ్రామా తీయాలని ఉందని వెల్లడించారు. 30-40 ఏళ్ల వయసులో మనశ్శాంతి ఎంతో ముఖ్యమని, వందమంది తోడుగా ఉండటం కంటే ప్రశాంతతనిచ్చే ఒక్కరు ఉంటే చాలని పేర్కొన్నారు.

►ALSO READ | 69 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని మార్చిన మహా ప్రయాణం.. 'శరణాగతి'గా శ్రీల ప్రభుపాదుల బయోపిక్!

మరోవైపు తరుణ్ భాస్కర్ వ్యక్తిగత జీవితం కూడా చర్చకు వస్తోంది. గతంలో లత నాయుడును వివాహం చేసుకున్న ఆయన ప్రస్తుతం ఈషా రెబ్బాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి కనిపించడం, పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలు ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి.

అయితే ఈ బంధంపై ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు. సినిమా ప్రమోషన్ల మధ్య తరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. మరి ఆయన చెప్పిన రిలేషన్‌షిప్ కథే భవిష్యత్తులో ఓ సినిమాగా తెరకెక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది..