Beauty tips: పెసల పేస్ట్.. చర్మం మెరిసిపోద్ది..!

Beauty tips:  పెసల పేస్ట్.. చర్మం మెరిసిపోద్ది..!

పెసలు ఆరోగ్యానికి ఎంత మంచివో చర్మానికి కూడా అంతే మంచివి. ముఖం మృదువుగా, కాంతివంతంగా మారాలంటే వారానికి ఒకసారైనా ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుంది. డెడ్ స్కిన్ ను పూర్తిగా తొలగించడమే కాదు ముఖానికి మెరుపు కూడా తెస్తాయి.

చర్మం దగ దగ మెరిసి పోవాలంలే పెసల ఫేస్​ ప్యాక్​ ను   ఉపయోగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  పెసలలో ఇనుము, ధాతువులు పుష్కలంగా వుంటాయి. ఈ ప్యాక్​ను .. ముఖానికి, చర్మానికివారానికి ఒకసారి  ప్యాక్‌లా వేసుకుంటే చర్మంపై మొటిమలు మాయమవుతాయి. అలాగే చర్మం మెరిసిపోతుంది. 

పెసల ఫేస్ ప్యాక్ తయారీ

రెండు స్పూన్ల పెసలను రాత్రి నాన బెట్టాలి. తెల్లారి వాటిని పేస్టులా రుబ్బాలి. ఆ పేస్టులో ఒక టీ స్పూన్ ఆల్మండ్ నూనె, ఒక టీ స్పూన్ తేనె వేసి కలపాలి. ఈ పేస్ట్ ను  ముఖానికి రాసి పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడగాలి.

►ALSO READ | Health Tips: చిటికెడు ఇంగువ.. బోలెడు లాభాలు..!

లాభాలు

పెసలతో వేసుకునే ఫేస్ ప్యాక్ డెడ్ స్కిన్​ ను  తొలగించి, చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. నల్లటి చర్మం కూడా నెమ్మది నెమ్మదిగా తెల్లగా మారే ఛాన్స్ ఉంది. పెసల్లో ఉండే విటమిన్ ఎ, సి చర్మాన్ని కాపాడతాయి, చర్మం కంది పోకుండా చేస్తాయి. వారానికి ఒక సారైనా ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచిది.