Weather report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ..తమిళనాడులో ఉరుములతో వర్షాలు

Weather report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ..తమిళనాడులో ఉరుములతో  వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  నవంబర్​ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 24 గంటల తరువాత వాయువ్యదిశగా కదులుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.  

అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 14 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.  తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో నవంబర్ 10, 11, 15, 16 తేదీల్లో భారీ వర్షాలు పడతాయి.  నవంబర్ 16న కేరళలోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం.

 నవంబర్ 10 నుంచి 14 వరకు అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. నవంబర్ 12న కశ్మీర్ లోయలో భారీ వర్షాలకు , మంచు కురిసే అవకాశం ఉంది.

►ALSO READ | E30, E20 పెట్రోల్ వల్ల బైక్, కార్లకు రిపేర్లు వస్తే ఇన్సూరెన్స్ రాదా?

తమిళనాడు పరిసరాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. నవంబర్ 14–16 మధ్య ఉత్తరాంధ్రలో  అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం  ఉంది.

ఇప్పటివరకు వాతావరణశాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం  అల్పపీడనం  మాత్రమే ఏర్పడే అవకాశం ఉందని .. అది  తుఫానుగా మారి ఏ ప్రాంతంలో తీరం దాటుతుందో  IMD ఇంకా ప్రకటించలేదు. తదుపరి వాతావరణ బులెటిన్లను బట్టి పరిస్థితులు మారవచ్చుని అధికారులు తెలిపారు. 
​